| Tamilnadu love story |
తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని.. మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కానీ, ఇటీవల చాలా మంది మహిళల తల్లిదండ్రుల ప్రేమను కాదని వేరొకరితో వెళ్తున్నారు. ప్రేమ పెళ్లి తప్పు కాదు.. కానీ, తమను చిన్నప్పటి నుంచి పెంచి.. ఎన్నో ఆశలు పెట్టుకున్న పేరెంట్స్ కి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రేమ ఇప్పుడు బాగానే ఉండొచ్చు.. కానీ, రాను రాను కుటుంబ బాధ్యతలు పెరిగితే అసలు సినిమా కనిపిస్తుందంటున్నారు.
అసలేం జరిగిందంటే
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని (Tamilnadu) తిరపత్తూరులో ఓ ప్రేమ జంట (Lovers marrige) వివాహం చేసుకుంది. తమకు పెద్దల నుంచి హనీ ఉందని రక్షణ కావాలని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్ కావడంతో పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. పెళ్లి చేసుకున్న వారి కంటే ముందే వారి తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. తమ పిల్లల రాకకోసం ఎదురు చూస్తున్నారు. తమ పిల్లను ఎలాగైనా నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనలో అమ్మాయి తరఫు తల్లిదండ్రులున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ లో హైడ్రామా చోటు చేసుకుంది. యువతి తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు(Police station) వచ్చింది. తమ కూతురిని చూడగానే ఆ కన్నవారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే కూతురి కాళ్లపై పడి మరీ తమతో రావాలని వేడుకున్నారు. కానీ, ఆ అమ్మాయి గుండె మాత్రం కరగలేదు. కనీసం ఆమెలో తన వారిని వేధిస్తున్నానన భావన కొద్దిగా కనిపించలేదు. అస్సలు వారు తల్లిదండ్రులు అనేది విచక్షణ కోల్పోయింది. చివరకు ఇద్దరు మేజర్ కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపించారు. తమ కూతురు వెళ్లిపోతుంటే ఆ కన్నవారు రోడ్డుపై పడి గుండెలవిసేలా రోదించారు.
పరువు కోసం కొంతమంది కూతుళ్లను ఈ భూమ్మిద లేకుండా చేస్తున్నా వారు కొందరైతే.. తమ కూతురిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తున్నారు. తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాక వారు ప్రేమ అంటూ కన్న వారిని ఎదిరించి వెళ్లడం కొంత మంది కన్నవాళ్లు జీర్ణించుకులేకపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల తమ పిల్లలపై ప్రేమతో ప్రేమ పెళ్లిళ్లు వద్దని వారిస్తున్నారు. మరికొన్ని చోట్ల తమ పిల్లలు ప్రేమించినవారిని సుపారీ గ్యాంగ్ తో హత్యలు చేయించిన ఘటనలు ఉన్నాయి. కానీ, వీరు మాత్రం తమ అమ్మాయి కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కూతురు సంతోషంగా ఉంటే చాలు అనే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మేజర్ కాబట్టి ఆమెకు ఎవరితో అయిన పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని అంటున్నారు. కానీ ఈ ఘటనపై పలువురు భావోద్వేగంతో కామెంట్స్ చేస్తున్నారు.
KEYWORDS
Tamilnadu, Tamil love story, Parents, parents crying, douthercrying, family emotions, police station, social media viral video, social media, viral video, managulfnews, managulfnews in telugu, మన గల్ఫ్ న్యూస్, మన గల్ఫ్ న్యూస్ తెలుగు వార్తలు, మన గల్ఫ్ న్యూస్ జాబ్స్, గల్ఫ్ సమాచారం తెలుగులో
For Latest Updates Please Follow Us